: సెక్షన్ 8 అమలు చేయాల్సిందే...సెటిలర్స్ ఫోరం పిటీషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలు కోసం గళమెత్తుతున్న గొంతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సెక్షన్ 8 అమలు కోసం ఏపీ, అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బాహాబాహీకి దిగాయి. పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. తాజాగా ఏపీ వాదనకు బలం చేకూరుస్తూ సెటిలర్స్ ఫోరం సెక్షన్ 8 అమలు కోసం గళం విప్పింది. హైదరాబాదులో సెక్షన్ 8 ను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ ఆ సంస్థ ప్రతినిధులు కొద్దిసేపటి క్రితం ఉమ్మడి రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

  • Loading...

More Telugu News