: ఏపీకి వచ్చిన పరిశ్రమను కేటీఆర్ తన్నుకుపోయారట!


రాష్ట్ర విభజన తర్వాత పెట్టుబడులను ఆకర్షించే విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పారిశ్రామికవేత్తలతో ఒక రాష్ట్రం జరుపుతున్న సంప్రదింపులపై మరో రాష్ట్రం నిఘా వేసే పరిస్థితి నెలకొంది. గతంలో హీరో మోటో కార్ప్ పరిశ్రమను రాబట్టుకునే విషయంలో ఇరు రాష్ట్రాలు పెద్ద ఎత్తున పోటీ పడ్డాయి. నాడు ఏపీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జేఎస్వీ ప్రసాద్ తనదైన చతురతతో సదరు పరిశ్రమను ఏపీకి తరలించుకుపోయారు. దీనిపై కాస్తంత ఇబ్బందిపడ్డ తెలంగాణ సర్కారు, సమయం కోసం వేచి చూసిందట. ఇటీవల మైక్రోమ్యాక్స్ తో చర్చలు జరిపిన ఏపీ సర్కారు, ఆ సంస్థ కర్మాగారాన్ని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయించే దిశగా దాదాపు ఒప్పించిందట. అయితే ఈ విషయం విశ్వసనీయ వర్గాల ద్వారా సేకరించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిపోయారు. మైక్రోమ్యాక్స్ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి ఏపీలో పెట్టాలనుకుంటున్న సదరు కర్మాగారాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేలా ఒప్పించారట. విషయం తెలుసుకున్న ఏపీ ప్రభుత్వం, ఇకపై పారిశ్రామికవేత్తలతో జరిపే చర్చలను కాస్తంత గోప్యంగా ఉంచాలని నిర్ణయించిందట.

  • Loading...

More Telugu News