: నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న లారీలు


నేటి అర్ధరాత్రి నుంచి లారీల సమ్మె ప్రారంభం కానుంది. లారీ ఓనర్స్ అసోసియేషన్ తో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో లారీ ఓనర్లు సమ్మెవైపు మొగ్గుచూపారు. పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్రం విధించిన వ్యాట్ తగ్గింపు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలపై పన్ను తగ్గింపుపై లారీలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో, డిమాండ్ల పరిష్కారానికి ఏడురోజులు గడువు ఇవ్వాల్సిందిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. డిమాండ్లను తక్షణం పరిష్కరించాలని లారీ ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. 'సమ్మె నోటీసిచ్చి ఇంత కాలమైనా పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం' అంటూ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించి, సమ్మెకు దిగుతోంది. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి లారీలు నిలిచిపోనున్నాయి.

  • Loading...

More Telugu News