: యూపీలో టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు వస్తే ల్యాప్ టాప్ ఫ్రీ


టెన్త్, ఇంటర్ లో మంచి మార్కులు సాధించిన 39,600 మంది విద్యార్థులకు ఉచిత ల్యాప్ టాప్ లు అందిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇందులో 21 శాతం ఎస్సీ,ఎస్టీ, 20 శాతం మైనార్టీ కోటా కొనసాగుతాయని సీఎం అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ల్యాప్ టాపుల్లో పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు సగం సగం పంచనున్నారు. స్టేట్ బోర్డ్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఇలా ఉత్తరప్రదేశ్ లో నిర్వహించే ఏ పరీక్షలో అయినా అత్యుత్తమ మార్కులు సాధించిన 19,800 మంది పదవ తరగతి, 19,800 ఇంటర్ విద్యార్థులు ఈ ల్యాప్ టాప్ లు సొంతం చేసుకోనున్నారు. కాగా, 2012లో ఎన్నికల సందర్భంగా ఉచిత ల్యాప్ టాప్, ట్యాబ్ లు అందిస్తామని సమాజ్ వాదీ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హామీ ప్రకారం ఆ ఏడాది సుమారు 15 లక్షల ల్యాప్ టాప్ లు అందజేసి, ట్యాబ్ ల సంగతి మర్చిపోయింది. ఆ తరువాత ల్యాప్ టాప్ లు ఇవ్వడం ఇదే.

  • Loading...

More Telugu News