: చంద్రబాబు ఇంకా కొన్ని పత్రికలకు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది: 'నమస్తే తెలంగాణ' ఎడిటర్


టీ న్యూస్ చానల్ కు ఏపీ సర్కారు నోటీసులు పంపడాన్ని 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి తప్పుబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు మరికొన్ని పత్రికలకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోందని అన్నారు. టీ న్యూస్ కు నోటీసులు ఇవ్వడం కచ్చితంగా మీడియా హక్కులను కాలరాయడమేనని దుయ్యబట్టారు. మీడియాపై దాడికి యత్నించడం ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు తప్పుచేశాడని విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికైనా నోటీసులను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు మీడియా సంఘాల నేతలతో కలిసి శేఖర్ రెడ్డి మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును గవర్నర్ అడ్డుకోవాలని అన్నారు. ఏపీ సీఎం తీరు ఇలాగే కొనసాగితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News