: ఈ ఈద్ కు 'భజరంగీ భాయీ జాన్'...వచ్చే 'ఈద్'కు 'సుల్తాన్'గా రానున్న సల్మాన్!


ఈ ఏడాది ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్ కు 'భజరంగీ భాయీ జాన్'గా అభిమానులను అలరించనున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వచ్చే ఏడాది ఈద్ కు 'సుల్తాన్' గా సందడి చేయనున్నాడు. 'సుల్తాన్'కు సల్లూభాయ్ అంగీకారం తెలిపినట్టు యష్ రాజ్ ఫిల్మ్స్ తెలిపింది. ఈ మేరకు వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ రెజ్లర్ గా నటించనున్నాడు. ఆదిత్యా చోప్రా నిర్మాణ సారధ్యంలో అలీ అబ్బాస్ దర్శకత్వంలో 'సుల్తాన్' రూపుదిద్దుకోనుంది. కాగా, ఈ సినిమాలో సల్మాన్ సరసన దీపికా పదుకునే, కంగనా రనౌత్ ను అనుకున్నప్పటికీ 'వన్ నేనొక్కడినే' ఫేమ్ కృతి సనోన్ ను తీసుకున్నట్టు యష్ రాజ్ ఫిల్మ్స్ తెలిపింది. కాగా, సల్మాన్ కు ఈద్ సెంటిమెంట్ జైలు నుంచి పట్టుకుందని, జైలు నుంచి విడుదలైన అనంతరం సల్లూభాయ్ ఈ సెంటిమెంట్ ను అనుసరిస్తున్నాడని బాలీవుడ్ టాక్.

  • Loading...

More Telugu News