: కేసీఆర్ కవ్వింపు వల్లే పరిస్థితి విషమం: టీ-టీడీపీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కవ్వింపు చర్యల కారణంగానే సెక్షన్-8 అమలు అంశం తెరపైకి వచ్చిందని టీ-టీడీపీ దుయ్యబట్టింది. ఈ మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నేత రాజారాం యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, గడచిన సంవత్సరం వ్యవధిలో ఏపీ ప్రభుత్వం ఏనాడూ సెక్షన్-8 పేరెత్తలేదని గుర్తు చేశారు. ఇప్పుడీ డిమాండ్ రావడానికి కేసీఆరే కారణమని ఆయన విమర్శించారు. టీడీపీ పార్టీని దెబ్బతీయాలన్న దురుద్దేశంతో కేసీఆర్ అడుగులు వేయబట్టే ఈ పరిస్థితి విషమించిందని రాజారాం ఆరోపించారు. ఇక ఇప్పుడు గవర్నర్ ఏం చెయ్యాలనుకుంటే అది చేయవచ్చని ఆయన అన్నారు.