: సాయంత్రం తనను కలవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కు గవర్నర్ పిలుపు


గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేష్ కుమార్ కు గవర్నర్ నరసింహన్ నుంచి పిలుపు వచ్చింది. ఈ సాయంత్రం 4 గంటలకు తనను కలవాలని గవర్నర్ వర్తమానం పంపినట్టు తెలిసింది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని సమాచారం. గ్రేటర్ హైదరాబాద్ లో వార్డుల విభజన అసంబద్ధంగా ఉందంటూ కాంగ్రెస్ నేతలు కొన్నిరోజుల కిందట గవర్నర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దానిపైన గవర్నర్ చర్చిస్తారా? లేదా? అనేది చూడాలి.

  • Loading...

More Telugu News