: ఎలా చేసినా సుష్మ, వసుంధరలు చేసింది తప్పే: బీజేపీ ఎంపీ


ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేలకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురైంది. ఈ వ్యవహారంలో వారిద్దరినీ బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ బహిరంగంగా తప్పుబడుతున్నారు. ఆర్థిక నేరాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ కు చట్టపరంగా, నైతికంగా... ఎలా సాయం చేసినా తప్పు తప్పేనని సింగ్ ఘంటాపథంగా అంటున్నారు. లలిత్ ను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. సుష్మ, వసుంధరలకు పార్టీ, కేంద్రం అండగా ఉంటే, ఎంపీ సింగ్ వ్యతిరేకంగా మాట్లాడటం కలకలం రేపుతోంది.

  • Loading...

More Telugu News