: క్యాంపు రాజకీయాల సంస్కృతి వైసీపీదే: మంత్రి శిద్ధా
ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికకు మెజారీటీ లేకపోయినా టీడీపీ తన అభ్యర్థిని నిలబెట్టిందని, ఇక్కడ కూడా కుట్రలకు పాల్పడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను మంత్రి శిద్ధా రాఘవరావు ఖండించారు. మండలి ఎన్నికకు ప్రకాశం జిల్లాలో టీడీపీకి స్పష్టమైన మెజారిటీ ఉందని చెప్పారు. క్యాంపు రాజకీయాల సంస్కృతి వైసీపీదేనని ఆరోపించారు. కేసీఆర్ తో వైఎస్ జగన్ ఆడుతున్న నాటకానికి ఇకనైనా స్వస్తి పలకాలని విజయవాడలో ఆయన సూచించారు. హైదరాబాద్ లో సెక్షన్ 8 తప్పనిసరిగా అమలు చేయాలని మంత్రి కోరారు.