: జింబాబ్వేలో టీమిండియా పర్యటన రద్దు
షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 10వ తేదీ నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటించాల్సి ఉంది. అయితే, ఈ పర్యటన రద్దయింది. బీసీసీఐ, టెన్ స్పోర్ట్స్ ఛానల్, జింబాబ్వే బ్రాడ్ కాస్టింగ్ సంస్థకు మధ్య కొన్ని వివాదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రసార హక్కులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారమయ్యాకే పర్యటన ఉంటుందని తెలుస్తోంది. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే వచ్చే ఏడాదికి సిరీస్ ను వాయిదా వేయనున్నారు.