: ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటుపై ఉగ్రదాడిని ఖండించిన మోదీ


ఆఫ్ఘనిస్థాన్ పార్లమెంటుపై ఉగ్రవాదులు చేసిన దాడిని భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అంతేకాకుండా, దాడిలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదని... ఆఫ్ఘనిస్థాన్ కు అన్ని విధాలా సాయం అందిస్తామని చెప్పారు. మరోవైపు, ఈ దాడికి పాల్పడింది తామేనని తాలిబాన్లు ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News