: ములాయం 'నకిలీ' కుమారుడు అరెస్టు


సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నకిలీ కుమారుడు అరెస్టయ్యాడు. ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ పేరిట మోసాలకు తెరతీసిన ఓ వ్యక్తిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ములాయం సింగ్ యాదవ్ కుమారుడు ప్రతీక్ యాదవ్ పేరు, చిరునామాతో ఇద్దరు వ్యక్తులు రెండు ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. వీరిలో ఒకరు ఆ నెంబర్ల నుంచి మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతికి ఫోన్ చేసి, తాను ప్రతీక్ ని మాట్లాడుతున్నానని, తాను సూచించిన వ్యక్తికి మైనింగ్ పనులు అప్పగించాలని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన ప్రజాపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మంత్రికి ఫోన్ చేసిన వ్యక్తి నకిలీ అని గుర్తించారు. దీంతో ప్రతిక్ పేరిట ఫోన్ చేసిన రామ్ శంకర్ షక్యాను, అతని అనుచరుడు ఫిరాక్ హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News