: విశాఖ విమానాశ్రయం కేంద్రంగా బంగారం అక్రమ రవాణా... కిలోల కొద్దీ బంగారం స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ విమానాశ్రయం కేంద్రంగా బంగారం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సుమారు 50 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమకందిన సమాచారం ప్రకారం, అధికారులు తనిఖీలు చేయగా కొంతమంది ప్రయాణికుల వద్ద ఈ అక్రమ బంగారం దొరికింది. ఈ నేపథ్యంలో 12 మందిని అదుపులోకి తీసుకుని, వారిని విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.