: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ కుట్రకు పాల్పడుతోంది: వైవీ సుబ్బారెడ్డి


ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ కుట్రలు చేయాలని చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. మెజారిటీ లేకపోయినా టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని గిమ్మిక్కులు చేసినా వైసీపీ అభ్యర్థిగా అట్టా చినివెంకటరెడ్డి గెలిచి తీరుతాడని ఆయన ఈరోజు ఒంగోలులో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యులు నిజాయతీతో ఉన్నారని ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి అన్నారు. కాగా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీలో ఉన్నారు.

  • Loading...

More Telugu News