: కుషాయిగూడలో డ్రగ్స్ రాకెట్... 13 కిలోల కొకైన్ స్వాధీనం, ఐదుగురి అరెస్ట్
హైదరాబాదులో నిషేధిత డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాతో పెద్ద సంఖ్యలో యువత పెడదారి పడుతోంది. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు నార్కోటిక్స్ విభాగం అధికారులు చేస్తున్న యత్నాలు కూడా ఫలించడం లేదు. తాజాగా నగరంలోని కుషాయిగూడ పరిధిలో పోలీసులు 13 కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మాదకద్రవ్యాన్ని విక్రయించేందుకు యత్నించిన ఐదుగురు సభ్యుల డ్రగ్స్ రాకెట్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.