: తల్లిలాగే అందంగా ఉన్నాడు... మంచి భవిష్యత్తు ఉంది: జయసుధ తనయుడికి టీఎస్సార్ కాంప్లిమెంట్


హైదరాబాదులో 'బస్తీ' సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. నటి జయసుధ తనయుడు శ్రేయాన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ సందర్భంగా సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ... తల్లి లాగే శ్రేయాన్ కూడా అందంగా ఉన్నాడని కితాబిచ్చారు. ఈ సినిమా హిట్టవ్వాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు జయసుధ గురించి ప్రస్తావించారు. జయసుధ సహజనటే కాదని, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అని అన్నారు. అన్నింటికీ మించి మానవత్వం ఉన్న మనిషని ప్రశంసించారు. మంచి మనసు కారణంగానే ఇప్పటికీ చక్కగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీనియర్ దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, నటుడు మోహన్ బాబు తదితరులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News