: శ్రీవారి దర్శనం చేసుకున్న గవర్నర్ దంపతులు
ఉభయరాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం తిరుమల చేరుకున్నారు. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. గవర్నర్ దంపతులు ఈ రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. రేపు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వెళతారు.