: మిత్రుడిని గుర్తు పట్టి దగ్గరకు పిలిచిన కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఓ స్నేహితుడిని గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఆదివారం ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్ కు అక్కడ ఓ వ్యక్తి ఎదురయ్యారు. ఆయనను చూడగానే కేసీఆర్ వెంటనే గుర్తుపట్టారు. ఆ వ్యక్తి పేరు బాలపోచయ్య. ఆయన, కేసీఆర్ గతంలో కాంగ్రెస్ యూత్ వింగ్ లో పనిచేశారట. అప్పటి స్నేహాన్ని, స్నేహితుడిని మర్చిపోని కేసీఆర్... బాలపోచయ్యను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావంటూ కుశల ప్రశ్నలడిగారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలవాలని తెలిపారు. దీంతో, బాలపోచయ్య ముఖం వెలిగిపోయిందట. మరి, పాత మిత్రుడికి కేసీఆర్ ఎలాంటి మర్యాదలు చేస్తారో చూడాలి!

  • Loading...

More Telugu News