: మమ్మల్ని కించపరిచారు...ఆ సినిమా నిషేధించాల్సిందే: న్యాయవాదులు
అవార్డులు, రివార్డులు సాధించిన 'కాక్కముట్టై' అనే తమిళ సినిమాలో న్యాయవాదులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, అందుకే దానిని నిషేధించాలని అఖిలభారత న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మణివన్నన్, మరో 50 మంది న్యాయవాదులతో కలిసి చెన్నైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ సినిమాలో నటనకు గాను ప్రధాన పాత్రలు పోషించిన రమేష్, విఘ్నేష్ లకు జాతీయ అవార్డులు రాగా, సినీ అభిమానులు చిత్రాన్ని ఎంతగానో ప్రశంసిస్తున్నారు.