: మన నేతలు పనికి మాలిన విద్యలో పీహెచ్ డీలు చేశారు: జేపీ


పార్టీ ఫిరాయింపులకు ఎలా పాల్పడాలి? కోట్లు పెట్టి నేతలను ఎలా కొనొచ్చు? వంటి పనికిమాలిన విషయాల్లో మన నేతలు పీహెచ్ డీ లు చేశారని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ప్రతి విషయంలో చైనా, సింగపూర్ అంటూ మాట్లాడే చంద్రబాబునాయుడు విద్యలో ఆ రెండు దేశాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖ ప్రతులను మీడియాకు చూపించారు. పరస్పర నిందారోపణలతో ఇద్దరు ముఖ్యమంత్రులు ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News