: ఫోటోలు తీసేసుకున్న తర్వాత పర్మిషన్ అడుగుతున్నారు: కమలహాసన్


మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే దేనిని పడితే దానిని ఫోటోలు తీసేస్తున్నారని ప్రముఖ నటుడు కమల్ హాసన్ అసహనం వ్యక్తం చేశారు. మనం ఓ పని చేసేటప్పుడు అవతలి వారు ఇబ్బంది పడకుండా చూడాలని సూచించారు. ప్రధానంగా ఫోటోలు తీసేటప్పుడు అవతలి వారి అనుమతి తీసుకోవాలని ఆయన తెలిపారు. 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాశం' చిత్రం విశేషాలపై మాట్లాడినప్పుడు ఆయన ఫోన్ గురించి కూడా ముచ్చటించారు. 'సెలెబ్రటీలతో ఫోటో దిగాలని అందరికీ ఉంటుంది. అయితే కొంత మంది తన ఫోటో తీసేసుకున్న తరువాత ఫోటో తీసుకుంటామని పర్మిషన్ అడుగుతుంటా'రని ఆయన చెప్పారు. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుందని అన్నారు. తమ తాజా సినిమాలో ఇదే అంశాన్ని చర్చించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News