: సోమవారం విజయవాడలో విచారణకు హాజరు కావాలంటూ 12 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు తాఖీదులు
ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తును ఏపీ సిట్ ముమ్మరం చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్, 12 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. సోమవారం విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని 12 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నోటీసుల్లో సూచించారు. ఇప్పటివరకు చేసిన కాల్ రికార్డింగ్, కాల్ డేటాలు తీసుకురావాలని ఆదేశించింది. రికార్డులు తారుమారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. సోమవారం ఉదయం 11 గంటలకు విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు చేరుకోవాలని ఏపీ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.