: మావోయిస్టుకు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న కానిస్టేబుల్
మృత్యువుతో పోరాడుతున్న మహిళా మావోయిస్టుకు రక్తదానం చేసి ఓ కానిస్టేబుల్ మానవత్వం చాటుకున్నాడు. ఛత్తీస్ గఢ్ లోని గాంగ్లూర్ ప్రాంతానికి చెందిన చిన్నీ ఒయామీ గత ఏడేళ్లుగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుగ్గా పాలు పంచుకుంటోంది. ఇటీవల డెంగ్యూతో బాధపడుతున్న ఆమె బీజాపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అత్యవసరంగా ఆమెకు రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించడంతో, స్థానిక కానిస్టేబుల్ ఉపేంద్ర రక్తదానం చేశారు. మానవత్వం చాటుకున్న ఆయనను వైద్యులు అభినందించారు.