: పత్రికా స్వేచ్ఛ గురించి కేసీఆర్ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది: మంత్రి పల్లె


టీన్యూస్ ఛానల్ కు ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమర్థించారు. ఎవరి ప్రతిష్ఠకైనా సరే భంగం కలిగించేలా ప్రసారాలు చేస్తే ప్రభుత్వ పరంగా పోలీసులు నోటీసులు ఇస్తారని అన్నారు. చివరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే టీన్యూస్ కు ఇచ్చిన నోటీసులకు కేసీఆర్, టీన్యూస్ సమాధానం ఇవ్వాలని సవాల్ విసిరారు. నోటీసులకు సమాధానం ఇవ్వాల్సింది పోయి, జర్నలిస్టులు ధర్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News