: పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు... మావోయిస్టు మృతి
విశాఖ జిల్లా పరిధిలోని మన్యంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య నేటి ఉదయం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు దళ సభ్యుడు మృతి చెందగా, మావోలకు చెందిన కీలక సమాచారం పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ముంచింగిపుట్టు మండలం రంగంవేలు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పుల అనంతరం మావోలు పరారు కాగా ఆ ప్రాంతంలో వారికి చెందిన పది కిట్ బ్యాగులు, మూడు గ్రెనేడ్లు, రెండు రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.