: ‘నారాయణ’లో యుద్ధకాండ...ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థుల మధ్య ఘర్షణ, 31 మందికి తీవ్ర గాయాలు
అత్యున్నత విద్యా ప్రమాణాలకు నెలవైన నారాయణ విద్యాసంస్థలకు చెందిన కళాశాలలో యుద్ధకాండ చోటుచేసుకుంది. విశాఖలోని మిథిలాపురి నారాయణ క్యాంపస్ లో రెండు వర్గాలుగా విడిపోయిన విద్యార్థులు పరస్పర దాడులకు దిగారు. ఈ దాడుల్లో 31 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘర్షణపై కళాశాల యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడ్డ విద్యార్థులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల మధ్య తలెత్తిన ప్రాంతీయ విభేదాల కారణంగానే ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు సమాచారం. ఘర్షణ నేపథ్యంలో మిథిలాపురిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.