: ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి
ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభం అయిన సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ స్ఫూర్తి ప్రపంచం మొత్తానికి వెలుగును ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరినీ ఈ రంజాన్ శాంతి, సామరస్యాల వైపు నడిపించాలని తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అని అన్నారు.