: 'ఆలిండియా ప్రీ మెడికల్ టెస్టు' నిర్వహణకు గడువు పెంచిన సుప్రీంకోర్టు


మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆలిండియా ప్రీ మెడికల్ పరీక్ష (ఏఐపీఎంటీ) నిర్వహణకు సుప్రీంకోర్టు మరికొంత సమయం ఇచ్చింది. ఆగస్టు 17లోగా పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయాలని సీబీఎస్ఈని ఆదేశించింది. మొదటిసారి మే 3న నిర్వహించిన ఈ ప్రీ మెడికల్ పరీక్ష పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడంతో అత్యున్నత న్యాయస్థానం ఆ పరీక్షను, ఫలితాల విడుదలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నాలుగు వారాల్లో మళ్లీ కొత్తగా పరీక్ష నిర్వహించాలని మూడు రోజుల కిందట సీబీఎస్ఈని ఆదేశించింది. అయితే అంత తక్కువ సమయంలో పరీక్ష నిర్వహణ సాధ్యంకాదని, మరికొంత సమయం ఇవ్వాలని సీబీఎస్ఈ నిన్న (గురువారం) పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు రెండు నెలల వరకు గడువు ఇచ్చింది.

  • Loading...

More Telugu News