: ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఫోరెన్సిక్ నిపుణుడు కేపీసీ గాంధీ నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేపీసీ గాంధీ నియమితులయ్యారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ట్రూత్ ల్యాబ్స్ పేరుతో దేశంలోనే తొలి ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని స్థాపించారు. అయితే, ఓటుకు నోటు కేసు వేడి పుట్టిస్తున్న సమయంలో, ఫోరెన్సిక్ నిపుణుడు కేపీసీని సలహాదారుగా నియమించడం ఆసక్తిని రేపుతోంది. ఏదేమైనప్పటికీ, ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులైన కేపీసీకి ఇక నుంచి కేబినెట్ హోదా లభిస్తుంది.