: సాక్షి పత్రిక, చానల్ పై సీఎం రమేశ్ సభా హక్కుల నోటీస్?
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యవహారంలో సాక్షి పత్రిక, చానెల్ తన హక్కులకు భంగం కలిగేలా కథనాలు వెలువరించాయని ఆరోపిస్తున్నారు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్. సాక్షి పత్రిక, సాక్షి చానల్ పై పార్లమెంటులో శుక్రవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇష్టం వచ్చినట్టు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులో పేర్కొంటున్న రూ.50 లక్షలు సీఎం రమేశ్ ఖాతా నుంచే డ్రా చేశారని కథనాలు రావడం తెలిసిందే. ఈ విషయమై రమేశ్ ను బుధవారం నాడు సాక్షి ప్రతినిధి ప్రశ్నించగా ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ డబ్బు తన అకౌంట్ నుంచే డ్రా చేశారని తేలితే పదవికి రాజీనామా చేస్తానని, ఆ ఆరోపణలు అవాస్తవమని తేలితే జగన్ తన పదవికి రాజీనామా చేస్తారా? అని రమేశ్ సవాల్ విసిరారు.