: శివసేన 'హాఫ్ సెంచరీ'!


మహారాష్ట్రలో మరాఠీలకు బలమైన వేదిక ఏర్పాటు, ప్రాంతీయ గుర్తింపు అంశాల ప్రాతిపదికగా రూపుదిద్దుకున్నదే శివసేన పార్టీ. శుక్రవారంతో ఆ పార్టీ ఆవిర్భావానికి హాఫ్ సెంచరీ పూర్తవుతుంది. బాల్ థాకరే 1966 జూన్ 19న శివసేన పార్టీని స్థాపించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయ యవనికపై తనదైన శైలిలో ప్రస్థానం సాగిస్తున్న ఈ పార్టీ మరాఠీల అభ్యున్నతే ప్రథమ ధ్యేయంగా పనిచేస్తోంది. నిన్నమొన్నటిదాకా రాష్ట్రంలో నెంబర్ వన్ పార్టీగా కొనసాగిన శివసేనను తాజాగా బీజేపీ వెనక్కినెట్టింది. దీనిపై పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ... మళ్లీ అగ్రపీఠం చేజిక్కించుకునేందుకు శ్రమిస్తామని చెప్పారు. ప్రస్తుతం శివసేన పార్టీని ఉద్ధవ్ థాకరే నడిపిస్తున్నారు.

  • Loading...

More Telugu News