: భారత్ ముందు భారీ టార్గెట్
మిర్పూర్ వన్డేలో భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 60, సర్కార్ 54, షకీబ్ అల్ హసన్ 52, షబ్బీర్ రెహ్మాన్ 41, హుస్సేన్ 34 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్ 3, భువనేశ్వర్ కుమార్ 2, ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీశారు. మోహిత్ శర్మ, జడేజా చెరో వికెట్ దక్కించుకున్నారు.