: సోమేశ్ తీరేం బాలేదు... జీహెచ్ఎంసీ కమిషనర్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్న గ్రేటర్ కాంగ్రెస్
గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ సోమేశ్ కుమార్ పై కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. కమిషనర్ తీరుపై గుర్రుగా ఉన్న గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ నేటి సాయంత్రం గవర్నర్ ను కలవనున్నారు. పార్టీ నేతలతో కలిసి నేటి సాయంత్రం 4 గంటలకు రాజ్ భవన్ వెళ్లనున్న దానం, సోమేశ్ కుమార్ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడే రంగంలోకి దిగింది. గ్రేటర్ పరిధిలోని పలు సమస్యలపై కమిషనర్ స్పందన సరిగా లేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.