: జగన్ ఇలాకాలో దారుణం... వేధింపులపై ఫిర్యాదు చేసిన యువతిపై దుండగుల దాడి


వైసీపీ అధినేత సొంతూరు పులివెందులలో కొద్దిసేపటి క్రితం దారుణం చోటుచేసుకుంది. తమపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న అక్కసుతో ఇద్దరు యువకులు ఓ యువతిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకెళితే... నిందితుల నుంచి బాధిత యువతి కొంతకాలంగా వేధింపులకు గురవుతోంది. వేధింపుల తీవ్రత మరింత పెరగడంతో సహించలేని ఆ యువతి సదరు యువకులపై నేటి ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించేలోగానే విషయం తెలుసుకున్న ఆ దుర్మార్గులు యువతిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. కాస్త ఆలస్యంగా మేల్కొన్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

  • Loading...

More Telugu News