: అమెరికాలో కాల్పుల కలకలం... 9 మంది మృతి!


అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. సౌత్ కరోలినా పరిధిలోని చార్లెస్టన్ నగరంలో 110 కాల్ హౌన్ స్ట్రీట్ లోని మెథడిస్ట్ చర్చిపై దాడి జరిగింది. ప్రార్థనలకు వచ్చిన క్రిస్టియన్లనే లక్ష్యంగా చేసుకుని ఓ దుండగుడు అత్యాధునిక తుపాకులతో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బుధవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6:30) ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఎంతమంది మృతి చెందారన్న విషయంలో అధికారిక సమాచారం లేనప్పటికీ, కనీసం 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ దాడికి గల కారణాలు తెలియరాలేదని, దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు. దుండగుడి వయసు 20 ఏళ్లు ఉంటుందని, తెల్లరంగులో ఉన్నాడని ట్విటర్ లో పోలీసులు పేర్కొన్నారు. ఘటనా స్థలిలో హెలికాప్టర్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, కాల్పుల తరువాత కూడా చార్లెస్టన్ వాసులు చర్చిలో నిర్భయంగా ప్రార్థనలు చేయడం గమనార్హం.

  • Loading...

More Telugu News