: సండ్ర వెంకటవీరయ్య అరెస్ట్ తప్పదా?.. టీ ఏసీబీ చేతిలో కీలక ఆధారాలు!


ఓటుకు నోటు కేసులో నేడో, రేపో మరో అరెస్ట్ తప్పేలా లేదన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అరెస్ట్ చేసేందుకు తెలంగాణ ఏసీబీ అధికారులు దాదాపు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సండ్రకు ఏసీబీ అధికారులు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. రేపు సాయంత్రం 5 గంటల్లోగా తమ ముందు హాజరుకావాలని నిన్న ఆయన నివాసం గోడకు అతికించిన నోటీసుల్లో ఏసీబీ గడువు విధించింది. అయితే మొన్న రాత్రి ఏసీబీ నోటీసుల నేపథ్యంలో సండ్ర దాదాపుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా వార్తలు వినవస్తున్నాయి. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టే క్రమంలో ఈ కేసులో నిందితుడు సెబాస్టియన్ తో సండ్ర సంప్రదింపులు నెరిపారని, ఈ మేరకు ఏసీబీ కీలక సాక్ష్యాలను సేకరించిందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న క్రమంలోనే ఆయన ఏసీబీ విచారణకు నిన్న హాజరుకాలేదని తెలుస్తోంది. అయితే రేపటిలోగా ఏసీబీ ముందు విచారణకు హాజరుకాక తప్పని పరిస్థితి ఉండటంతో ఆయన అరెస్ట్ తధ్యమేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News