: వేం నరేందర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసిన టీడీపీ నేతలు
తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని పార్టీ నేతలు ఆయన నివాసంలో కలిశారు. పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు నరేందర్ ఇంటికి వెళ్లారు. ఏసీబీ విచారణ వివరాలను నరేందర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం విషప్రచారానికి పాల్పడుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసేందుకు టీఆర్ఎస్ తో కలిసి జగన్ కుట్రకు పాల్పడ్డాడని మండిపడ్డారు. టీఆర్ఎస్ తో కలిసి జగన్ కుట్ర పన్నితే చంద్రబాబు రాజీనామా చేయాలా? అని ప్రశ్నించారు. ఆంధ్రా ప్రజలను టీఆర్ఎస్ ఇబ్బందుల పాల్జేసినా జగన్ నోరు మెదపలేదని అన్నారు. జగన్ ఏ ఉద్దేశంతో టీఆర్ఎస్ తో కుమ్మక్కై చంద్రబాబును విమర్శిస్తున్నారో చెప్పాలని నిలదీశారు. త్వరలోనే అన్ని కుట్రలను ఛేదిస్తామని ధూళిపాళ్ల ధీమా వ్యక్తం చేశారు.