: బస్ స్టేషన్ టీవీల్లో పోర్న్ చిత్రం ప్రసారం... నివ్వెరపోయిన ప్రయాణికులు
కేరళలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులను ఉల్లాసపరిచేందుకని ఏర్పాటు చేసిన టెలివిజన్ సెట్లలో పోర్న్ చిత్రం ప్రసారమైంది. ఈ ఘటన కాల్పేట పట్టణంలోని బస్ స్టేషన్ లో జరిగింది. బస్సులు వస్తున్నాయి, వెళుతున్నాయి... ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో, బస్ స్టేషన్ లో ఉన్న సీసీ టీవీల్లో అశ్లీల చిత్రం రావడంతో, అక్కడున్న ప్రయాణికులు నివ్వెరపోయారు. 'ఇదేంటి?... ఇలాంటి సినిమా వస్తోంది!' అనుకుంటూ అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేబుల్ ఆపరేటర్ దే తప్పని తేల్చారు. అతడు వాణిజ్య ప్రకటనల క్లిప్పింగ్ కు పోర్న్ చిత్రాన్ని కూడా జతచేశాడని తెలిపారు. ఆ కేబుల్ ఆపరేటర్ ను అరెస్టు చేశారు.