: గవర్నర్ తో ముగిసిన కేసీఆర్ సమావేశం


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ ముగిసింది. ఓటుకు నోటు అంశంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఈ సమావేశంలో గవర్నర్ కు కేసీఆర్ వివరించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులివ్వడం, విచారణ జరుపుతుండటం, స్టీఫెన్ వాగ్మూలం తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఓటుకు నోటు వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఏపీ మంత్రులు శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఫిర్యాదు చేశారు. మరోవైపు, ఈరోజు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయన్న వదంతులు వస్తున్న నేపథ్యంలో, గవర్నర్ తో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీ దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగింది.

  • Loading...

More Telugu News