: కేసీఆర్ సర్కారుపై ఏపీలో నిరసనలు షురూ...రాజమండ్రిలో గోరంట్ల ఆధ్వర్యంలో టీడీపీ ఆందోళన
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సహా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 120 మంది కీలక వ్యక్తుల ఫోన్లను తెలంగాణ సర్కారు ట్యాపింగ్ చేయడంపై ఏపీ ప్రజలు భగ్గుమన్నారు. ఇప్పటికే టీ సర్కారుపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం ఆందోళనలు కూడా మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఫోన్ ను ట్యాపింగ్ చేసిన తెలంగాణ అధికారులను అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా గోరంట్ల డిమాండ్ చేశారు.