: సుష్మానే కాదు... ముగ్గురు యూపీఏ మంత్రులూ, ఓ ముఖ్యమంత్రి నాకు సహకరించారు: బాంబు పేల్చిన లలిత్ మోదీ


వీసా డాక్యుమెంట్ల వ్యవహారంలో తనకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మా స్వరాజ్ ను లలిత్ మోదీ వెనకేసుకొచ్చారు. కేవలం సుష్మా మాత్రమే కాదని, యూపీఏలోని ముగ్గురు మంత్రులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా తనకు సహకరించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం మాంటెనీగ్రోలో సెలవులు గడుపుతున్న లలిత్, ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, డిసెంబర్ 2013లో వసుంధరా రాజే, తన భార్యకు పోర్చుగల్ లో క్యాన్సర్ చికిత్స నిమిత్తం స్వయంగా తీసుకెళ్లారని తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదని, తానిప్పుడు బహిర్గతం చేస్తున్నానని అన్నారు. తనకు చాలా మంది రాజకీయ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయని వివరించిన మోదీ, యూపీఏ మంత్రులు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్, రాజీవ్ శుక్లాలు సహాయం చేశారని తెలిపారు. మోదీ వ్యాఖ్యలపై శుక్లా స్పందిస్తూ, మూడేళ్లుగా అతనితో మాట్లాడలేదని తెలుపగా, ఇండియాకు వచ్చి విచారణను ఎదుర్కోవాలని మాత్రమే ఆయనకు సలహా ఇచ్చినట్టు పవార్ అన్నారు. తనకు లలిత్ మోదీ కుటుంబం చానాళ్లుగా పరిచయమని, ప్రస్తుతం జరుగుతున్న డాక్యుమెంట్ల రాద్ధాంతం ఏంటో తనకు తెలియదని వసుంధరా రాజే వ్యాఖ్యానించారు. కాగా, మోదీ తాజా ఇంటర్వ్యూ ఆధారంగా, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.

  • Loading...

More Telugu News