: స్కూల్ బస్సు విధ్వంసం... రెండేళ్ల పాపకు తీవ్ర గాయాలు
వరంగల్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఓ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. జిల్లాలోని ములుగులో పాఠశాలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన స్కూలు బస్సు, అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన స్థానికులు చిన్నారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బస్సును స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు.