: నోటీసులు అందలేదు... అందితే విచారణకు హాజరవుతా: సండ్ర వెంకట వీరయ్య
తెలంగాణ ఏసీబీ నుంచి ఇప్పటిదాకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. ఆయనకు ప్రభుత్వం కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్ కు నిన్న రాత్రి వెళ్లిన ఏసీబీ అధికారులు, సదరు క్వార్టర్ కు తాళం వేసి ఉండటంతో కిటికీ లోంచి నోటీసుల కాపీలను ఇంటిలో వేసి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటవీరయ్య ఇప్పటిదాకా తనకెలాంటి నోటీసులు అందలేదని నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత చెప్పారు. ఒకవేళ ఏసీబీ నోటీసులు అందితే నిబంధనల మేరకు విచారణకు హాజరవుతానని, తనకు తెలిసిన విషయాలను చెబుతానని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వెంకటవీరయ్య ఓటుకు నోటు కేసులో కీలక భూమిక పోషించారని ఏసీబీ భావిస్తోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి కీలక ఆధారాలను కూడా ఏసీబీ అధికారులు సేకరించినట్లు సమాచారం.