: అది చంద్రబాబు గొంతే అనుకుంటున్నా... అయినా, ఆయనేం తప్పుగా మాట్లాడారు?: జేసీ
ఓటుకు నోటు వ్యవహారంపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని మీడియా స్పందన కోరింది. ఈ సందర్భంగా ఆయన బదులిస్తూ... ఆడియో టేపుల్లో ఉన్న గొంతు చంద్రబాబునాయుడిదేనని తాను అనుకుంటున్నానని, అయితే, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. "స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమన్నాడు... అంతేగా! అందులో ఏం తప్పుందో నాకైతే తెలియడంలేదు" అని అన్నారు. దీని గురించి ఇంతగా బుర్రలు పాడుచేసుకోవడం అనవసరం" అని మీడియాకు హితవు పలికారు. ఈ వ్యవహారం కోసం భోజనాలు మానేసి, పడిగాపులు కాయడం ఎందుకని మీడియా ప్రతినిధులపై జాలి ప్రదర్శించారు.