: ఇక ఇంటి వద్దే పుష్కర స్నానం...గోదావరికి వెళ్లలేని వారికి తపాలా శాఖ వినూత్న ఏర్పాటు


పన్నెండేళ్లకోమారు వచ్చే గోదావరి పుష్కరాలు జూలై 14 నుంచి మొదలు కానున్నాయి. 12 రోజుల పాటు జరగనున్న పుష్కరాల్లో గోదావరిలో పవిత్ర స్నానమాచరించాలని ప్రతి హిందువూ తపించడం తెలిసిందే. అయితే వృద్ధులు, వికలాంగులతో పాటు కొన్ని అనివార్య కారణాల వల్ల గోదావరి తీరానికి వెళ్లలేని వారు పుష్కరాల్లో పవిత్ర స్నానం చేయలేకపోయామని మధనపడటమూ మనకు తెలిసిందే. ఇలాంటి వారి కోసం తపాలా శాఖ ఓ వినూత్న చర్యకు శ్రీకారం చుడుతోంది. పవిత్ర గోదావరి జలాన్ని ప్యాక్ చేసి మన ఇంటి ముంగిట అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అర లీటరు గోదావరి జలాన్ని రూ.20లకు అందించనున్నట్లు ఆ శాఖ వెల్లడించింది. ఈ తరహాలో పుష్కర స్నానం చేయాలనుకునేవారు తమకు సమీపంలోని తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని ఆ శాఖాధికారులు చెప్పారు.

  • Loading...

More Telugu News