: ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించే అవకాశం: జేపీ
సంచలనం రేకెత్తిస్తున్న ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. ఈ వ్యవహారాన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా చూడరాదని... ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించిన అంశమని చెప్పారు. గతంలో లోక్ సభ స్పీకర్ గా ఉన్న సోమనాథ్ చటర్జీ 17 మంది ఎంపీలను అనర్హులుగా ప్రకటించారని జేపీ గుర్తు చేశారు. ఈ కేసును, విభజన చట్టంలోని సెక్షన్-8కి లింకు పెట్టి మాట్లాడటం సరికాదని చెప్పారు.