: ప్రాణాలు కాపాడండని ప్రేమజంట వేడుకోలు


ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు తమ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని, వధువు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని గుంటూరు జిల్లాకు చెందిన యువజంట ఎస్పీని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే, యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన అత్తోట శ్యామ్‌ కుమార్‌ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బీ-ఫార్మసీ విద్యార్థిని ఎన్‌.నవ్య, శ్యామ్ లు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినప్పటికీ, వీరి ప్రేమను నవ్య తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 12న పారిపోయి, 13న హైదరాబాదులోని ఆర్యసమాజంలో పెళ్లి చేసుకున్నారు. అదేరోజు రాత్రి చిలకలూరిపేట రూరల్‌ సీఐ వద్దకు రావాలని శ్యామ్‌ కుమార్‌ కు యడ్లపాడు ఎస్‌ఐ నుంచి ఫోన్ వచ్చింది. శ్యామ్ వెళ్లేలోగానే, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో, నవ్య వర్గీయులు, తమ ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఫర్నీచర్‌, సామగ్రిని తగుల బెట్టారని శ్యామ్‌ ఆరోపించాడు. తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, నవ్య కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News