: కార్వీపై సెబీ వేటు... ఏడాది పాటు ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాల నుంచి బహిష్కరణ


హైదరాబాదు కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు సాగిస్తున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ పై సెబీ కొరడా ఝుళిపించింది. 2003-05 మధ్య కాలంలో ఆ సంస్థ పాల్పడ్డ ఆర్థిక అవకతవకలను నిర్ధారించిన సెబీ, కార్వీని ఏడాది పాటు ప్రైమరీ మార్కెట్ కార్యకలాపాల నుంచి బహిష్కరించింది. అయితే ఇప్పటికే ఈ మార్కెట్ లో చేజిక్కించుకున్న వ్యాపారాన్ని మాత్రం నిర్వహించుకునే వెసులుబాటును కార్వీకి కల్పించింది. ఈ మేరకు నిన్న సెబీ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. సెబీ నోటీసుల నేపథ్యంలో ఏడాది పాటు ప్రైమరీ మార్కెట్ లో కార్వీ కొత్త వ్యాపారాలను నిలిపేయక తప్పని పరిస్థితి నెలకొంది.

  • Loading...

More Telugu News