: ఏపీ కేబినెట్ భేటీ రేపటికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం రేపటికి వాయిదా పడింది. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం నేటి ఉదయం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కావాల్సి ఉంది. ఈ భేటీలో భాగంగా ఓటుకు నోటు కేసు, చంద్రబాబు ఆడియో టేపులపై విపులంగా చర్చించడంతో పాటు ఏపీలో తెలంగాణ ఏసీబీపై నమోదైన కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుపైనా తుది నిర్ణయం తీసుకుంటారన్న వాదన వినిపించింది. అయితే నేడు జరగాల్సిన కేబినెట్ భేటీని రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం నేటి ఉదయం ప్రకటించింది. అయితే, దీనికి కారణాలను మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.